అక్షరటుడే, బాన్సువాడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ ఏమైందని బీజేపీ ఓబీసీ యువ మోర్చా నాయకులు ప్రశ్నించారు. ఈ మేరకు బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం తహసీల్దార్ లతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శులు బంతల శ్రీనివాస్, యోగేష్, హన్మాండ్లు, రవి, సాయిబాబా, బస్వరాజు, నవీన్, నగేశ్, జగదీశ్, విజయ్ పాల్గొన్నారు.