అక్షరటుడే, వెబ్ డెస్క్: ఫిమేల్ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అవకాశం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024- 25 విద్యా సంవత్సరానికి 27 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్ఎడబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

వివరాలు:

కోర్సు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్)/ ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సు

సీట్ల సంఖ్య: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 180. ప్రైవేట్ లో 860.

మొత్తం సీట్లు: 1,040.

అర్హత: ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ

25-10-2024 : రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ

31-10-2024 : ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తేదీ

01-11-2024 : తరగతులు ప్రారంభం