అక్షరటుడే, ఆర్మూర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ఉదయం గేట్లను మూసివేసినట్లు డ్యాం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కొత్త రవి తెలిపారు. ఉదయం 7 గంటల వరకు 26 గేట్లు తెరిచి ఉండగా, 8 గంటల వరకు 9 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో మరింత తగ్గడంతో 8.30 గంటలకు అన్ని గేట్లను మూసివేశారు. ప్రాజెక్టులోకి 76,643 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. కాల్వల ద్వారా 23,867 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా 1088.40 అడుగుల(71.090 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.