అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. మూడు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తహశీల్దార్ మల్లయ్య తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అవసరం ఉంటే అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు.