అక్షరటుడే, ఆర్మూర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లను మూసివేశారు. ప్రాజెక్టులోకి శనివారం ఉదయం 14,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ ఫ్లో నమోదవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది.