అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి వరద వస్తుండటంతో సోమవారం రాత్రి అధికారులు మూడు గేట్లను ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 12,150 క్యూసెక్కులను మంజీరలోకి, 500 క్యూసెక్కులు ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందన్నారు.