అక్షరటుడే, జుక్కల్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ రెండు గేట్లను అధికారులు ఎత్తారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 33,871 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. రెండు గేట్ల ద్వారా నిజాంసాగర్‌కు 16,284 క్యూసెక్కులను వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 2,822 క్యూసెక్కులు విడిచి పెడుతున్నారు. గేట్లు ఎత్తడంతో మంజీర పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.