అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తారు. జలాశయంలోకి ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా నాలుగు వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 12,496 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 6,800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 50 క్యూసెక్కులు, వరద కాలువకు 8000 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 29,666 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టo 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతే నీటి నిల్వతో నిండుకుండలా ఉంది.

అప్రమత్తంగా ఉండాలి

ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు దిగువన గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలో చేపలు పట్టడానికి వెళ్లొద్దని, పశువుల కాపరులు, రైతులు నది వైపు వెళ్లొద్దని సూచించారు.