అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద పెరగడంతో బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరిలోకి నీటి విడుదల నేపథ్యంలో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూచించారు. మత్స్యకారులు, పశువుల కాపరులు, రైతులు నది వైపు వెళ్లొద్దని ఆయన కోరారు.