అక్షరటుడే, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు శనివారం ఎత్తనున్నారు. గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదలనున్నారు. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ఎగువన గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించింది.
సుప్రీం కోర్టు తీర్పు మేరకు..
బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంతో శ్రీరామ్సాగర్కు వరద వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తి ఉంచాలని ఆదేశించింది. అలాగే ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో అక్కడక్కడ నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న 0.6 టీఎంసీలు దిగువకు వదలాలని ఆదేశించింది.
ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో..
ఎస్సారెస్పీ, బాబ్లీ ప్రాజెక్ట్ అధికారుల సమక్షంలో శనివారం మధ్యాహ్నం బాబ్లీ గేట్లను ఎత్తనున్నారు. 0.6 టీఎంసీలు వదిలిన తర్వాత గేట్లను మళ్లీ మూసి వేస్తారు. అయితే 0.6 టీఎంసీలే కావడంతో ఎస్సారెస్పీలోకి నీరు వచ్చే అవకాశం లేదు. బాబ్లీ దిగువన గోదావరిలో మాత్రం జలకళ రానుంది.