అక్షరటుడే, వెబ్ డెస్క్: స్టాక్ మార్కెట్‌లో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ షేర్లు సోమవారం దాదాపు 8.3 శాతం పతనమయ్యాయి. కొన్ని రోజులుగా ఓలా కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్, స్టాండప్ కమెడియన్ కునాల్ శర్మ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ కారణంగా కంపెనీ భారీ మూల్యం చెల్లించుకుంది. దేశంలో ఓలా కంపెనీకి సర్వీస్ సెంటర్లు బాగా లేవని కమెడియన్ కునాల్ శర్మ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కంపెనీ సీఈవో స్పందిస్తూ ‘కామెడీ కెరీర్ పూర్తవడంతో పాపులారిటీ కోసం ఇలాంటి పోస్టులు పెడుతున్నావు’ అంటూ చురకలంటించారు. అయితే పలువురు నెటిజన్లు సైతం ఓలా కంపెనీ సర్వీస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎఫెక్ట్ కంపెనీ షేర్ల మీద పడింది.