అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ మంత్రి మండలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 23న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు భేటీ జరగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ కేబినేట్‌ భేటీలో చర్చించనున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.