అక్షరటుడే, ఇందూరు: నగరంలోని 50వ డివిజన్ శివాజీ నగర్‌లో శుక్రవారం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్రప్రసాద్, కార్పొరేటర్ బట్టు రాఘవేందర్‌తో కలిసి పర్యటించారు. కాలనీవాసులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా డ్రైనేజీ సరిగ్గా లేని కారణంగా మురికి నీరు ఇళ్ల ముందు చేరుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొత్త పైప్ లైన్, సీసీ డ్రైనేజీ నిర్మించాలని కార్పొరేటర్ కోరారు.