అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో రోడ్లను ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన దుకాణాలను సోమవారం మున్సిపల్, పోలీస్ అధికారులు తొలగించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటుచేసిన దుకాణాలను పొక్లెయినర్ సహాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.