అక్షరటుడే, బాన్సువాడ: రుద్రూర్ మండలం కొండాపూర్ శివారులో కబ్జాచేసిన భూమిని పంచాయతీకి అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. గైనిగుట్ట ప్రాంతంలో ఏడు ఎకరాల అసైన్డ్ భూమిని సులేమాన్ ఫారం గ్రామానికి చెందిన కరీం అనే వ్యక్తి కబ్జా చేసి ఇటుకల బట్టి నిర్వహిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.