అక్షరటుడే, కామారెడ్డి: భారతీయ కిసాన్ మోర్చా పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం బీజేపీ నాయకులు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.