అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీరాముడి అలంకారంలో పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి వాహనసేవ సాగింది. ఈవాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.