అక్షర టుడే, వెబ్ డెస్క్ Ugadi Panchangam 2025 : కొత్త సంవత్సరం ఉగాది పండుగ, (Ugadi Festival) మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సాంప్రదాయ బద్ధంగా ఘనంగా జరుపుకుంటారు. (Ugadi Festival) ఉగాది పండుగలో ఇంటిని పచ్చని మామిడి తోరణాలతో,ఇంకా ఉగాది పచ్చడి అంటే షడ్రుచులతో , చేదు, వగార, పులుపు, తీపి, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు అయితే ఉన్నాయో… జీవితంలో కూడా అన్ని షడ్రుచులు ఉంటాయి.మన జీవితంలో కూడా అన్ని రకాలా అనుభవిస్తారు. అయితే, (Ugadi New Year) ఉగాది కొత్త సంవత్సరంను అంచనా వేయడానికి జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఉగాది రోజున ఆయిల్ స్తాన్నం, ఈ రోజును ప్రారంభిస్తారు.ఇలా చేస్తే శరీరం, ఆత్మను శుభ్రపరచడమే విశ్వాసంగా పేర్కొన్నారు. (Ugadi) ఉగాది అంటే ” యుగాది”. కొత్త సంవత్సరం ప్రారంభం. ఉగాది చరిత్ర నవరాత్రి తో సమానంగా వస్తుంది. ఇది ఉత్తర భారత దేశంలో దుర్గాదేవికి అంకితం చేయబడిన 9 రోజుల పండుగ.ఈ ఏడాది 2025వ సంవత్సరములో ఉగాది, మార్చి 34 జరుపుకుంటున్నారు. ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ చైత్రమాసంలో మొదటి రోజు, 12వ శతాబ్దంలో ఉగాదిని భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ” భాస్కరాచార్య”. నూతన సంవత్సరంలో ప్రారంభమని గుర్తించారు.
ఈ రోజు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. నూతన సంవత్సరాన్ని అంచనా వేయటానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. కోత్త సంవత్సరములో ఆరు రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అందులో కారం, వగరు , తీపి, రెండు రకాల పుల్లని, చేదు ఎలా అయితే ఉంటాయో, ఇవే రుచులు జీవితంలో కూడా అనుభవిస్తారు. ఈ రుచులు మన జీవితంలోని అనుభవాలను సూచిస్తాయి అని నలగొండ జిల్లాలోని వల్లాల గ్రామానికి చెందిన పురోహితులు” రామలింగయ్య శర్మ “లోకల్ 18 తో తెలిపారు.ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణం ( పంచాంగం వినటం) ముఖ్యమైన సాంప్రదాయంగా పాటిస్తారని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఆయన మాటల్లోనే తెలియజేశారు.
భవిష్య ఫలితాల కోసం : పంచాంగాలకు ఉగాది పండుగ రోజున ముఖ్య పాత్ర పోషిస్తుంది. పంచాంగం ప్రకారం వచ్చే సంవత్సరం రాశుల ప్రకారం ఎలా ఉండబోతుందో, రాజపక్షం, వర్షపాతం, వ్యాపారం, ఆరోగ్యం, సమాజం మొత్తం మీద ఎలా ఉంటుందో వివరంగా తెలుస్తుంది. అలాగే శుభ శకున నిర్ణయం, కొత్త సంవత్సరం మనకు శుభానందిస్తుందా లేదా అన్నది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనం ఏ రంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏవి మెరుగ్గా ఉండబోతున్నాయో అర్థం అవుతుంది.
గ్రహాల మార్పులు అలాగే వాటి ప్రభావం : గ్రహాల యొక్క మార్పులు మన జీవితం మీద ఎలాంటి మార్పులను, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ప్రత్యేకంగా గురుడు, శని, రాహు కేతు సంచారాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజున పండితులు తెలియజేశారు. యజ్ఞయాగాదులు, పరిహారాలు, అనుకున్న దానికంటే కష్టం ఉంటుందని తెలిస్తే, దానికి శస్త్రృక్తా పరిహారాలు సూచిస్తారు. వీటిలో జపాలు, హోమాలు, దానాలు, వ్రతాలు ఉంటాయి. మంచి పనులకు ప్రణాళిక,కొత్త సంవత్సరంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి వాటికి శుభముహూర్తాలు తెలుసుకోవడానికి పంచాంగం వినడం అవసరం. పంచాంగం వినడం ద్వారా భవిష్యత్తును అంచనా వేసి, మన కార్యాచరణను సరిగ్గా ప్రణాళిక బద్ధంగా అమలు చేసుకోవచ్చు. చాలామంది ఉగాది పండుగ రోజున పంచాంగం వింటూ ఉంటారు. తమ భవిష్యత్తు ఈ సంవత్సరము ఎలా ఉంటుందో అని పంచాంగం ద్వారా తెలుసుకుంటారు.