అక్షరటుడే, వెబ్ డెస్క్: దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలనుంచి 7 గంటల వరకు దేశీయ స్టాక్ మార్కెట్లలో మూరత్ ట్రేడింగ్ నిర్వహించారు. సెన్సెక్స్ 634 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. చివరికి సెన్సెక్స్ 335 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో ముగిసింది. బీఎస్‌ఈలో నమోదైన స్టాక్‌లలో 3,038 కంపెనీలు లాభపడగా 539 స్టాక్స్ నష్టపోయాయి. నిఫ్టీ ఫిప్టీలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు మినహా మిగతా షేర్లన్నీ లాభాలతో ముగిశాయి.