Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: మాఘ అమావాస్య సందర్భంగా నిజాంసాగర్ మండలం అచ్చంపేట శివారులో గల నాగమడుగు వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం వేకువజామున నుంచే భారీగా భక్తులు తరలి వచ్చారు. పుణ్యస్నానాలు చేసిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అచ్చంపేట గ్రామానికి చెందిన భజన భక్త బృందం సభ్యులు భక్తులకు అన్నదానం చేస్తున్నారు. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement