అక్షరటుడే, ఇందూరు: దేశంలోని హిందూ, ముస్లింలకు ఒకే విధమైన పౌరస్మృతి ఉండాలని ఉద్ఘాటించిన వ్యక్తి శ్యామాప్రసాద్‌ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి అన్నారు. శనివారం శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దినేష్‌ మాట్లాడుతూ.. తొలి హిందువాద రాజకీయ పార్టీ జన సంఘ్ ను స్థాపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్‌, కిషోర్‌, స్వామి యాదవ్‌, మధు, నాగరాజు, జశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌ బీజేపీ ఆధ్వర్యంలో..

ఆర్మూర్‌ బీజేపీ ఆధ్వర్యంలో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ద్యాగ ఉదయ్‌, అధికార ప్రతినిధులు జి.వి.నరసింహారెడ్డి, కలిగోట గంగాధర్‌, అనిల్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్‌, నాయకులు పోల్కం వేణు, పులి యుగేందర్‌, నూతల శ్రీనివాస్‌ రెడ్డి, విజయానంద్‌, దుగ్గి విజయ్‌, తోట నారాయణ, కౌటిక విజయ్‌, ఆరే రాజేశ్వర్‌, పుప్పల గిరిధర్‌, కృష్ణ గౌడ్‌ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

కామారెడ్డి మండలంలోని నరసన్నపల్లిలో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చందన శ్రీధర్‌, గ్రామ అధ్యక్షుడు రాజేందర్, యువ మోర్చా అధ్యక్షుడు రాహుల్‌, అల్లే శ్రీను ప్రకాష్‌, నరేందర్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.