అక్షరటుడే, జుక్కల్ : కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా.. జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, దీపారాధనలు కొనసాగించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజాంసాగర్ చంద్రమౌళీశ్వర ఆలయంలో భక్తులు తెల్లవారుజామునే ఆకాశదీపం వెలిగించారు. వేద పండితులు సంజీవరావు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.