అక్షరటుడే, బోధన్: నిజామాబాద్ ఇంఛార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది జిల్లాలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ACP నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య, CCS సిబ్బంది దాడి చేశారు. 22 మందిని అదుపులోకి తీసుకొని, రూ. 31,200, 24 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని బోధన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే అనీషా నగర్ కాలనీలో AR కిరాణా షాపులో చైనా మాంజా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి, రూ.8వేల విలువైన ఎనిమిది చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. షాపు యాజమాని జునైద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.