అక్షరటుడే, వెబ్‌డెస్క్: కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి గంగాధర మండపం, ఆలయ క్షేత్రంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో మల్లన్న అలంకార దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.