అక్షరటుడే, బోధన్ : బోధన్ పట్టణంలో పేకాడుతున్న 11 మందిని మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కాలనీలో కొందరు పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి రూ. రెండు లక్షల 3 వేలు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్ కు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement