అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake : నేపాల్‌ను శుక్రవారం రాత్రి రెండు భూకంపాలు కుదిపేశాయి. పశ్చిమ జాజర్‌కోట్ జిల్లాలో ఈ భూకంపాలు సంభవించాయి. ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో ఏర్పడ్డాయి. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం..
జాజర్‌కోట్‌లో రాత్రి 8:07 గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. ఆ తర్వాత రాత్రి 8:10 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో రెండో బలమైన భూకంపం సంభవించింది. వీటిని కేంద్రంలోని సీనియర్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త లోక్ బిజయ్ అధికారి ధ్రువీకరించారు.
గత సంవత్సరం 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం నుంచి ఇప్పటికీ కోలుకోని పర్వత జిల్లా అయిన జాజర్‌కోట్‌లో రెండు భూకంపాల కేంద్రాలు ఉన్నాయి. నష్టం, ప్రాణనష్టం గురించి ఇంకా వివరాలు అందలేదు.