అక్షరటుడే, కోటగిరి : పోతంగల్ మండలం కల్లూర్ వద్ద రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొనడంతో బిచ్కుంద మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. బరంగేడ్గి గ్రామానికి చెందిన ఒకరికి గాయాలు కావడంతో అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.