అక్షరటుడే, బోధన్: మండలంలోని సాలూర క్యాంప్ వద్ద బుధవారం ఉదయం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న కారు సాలూరా క్యాంప్ వద్ద అదుపు తప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం మరో బైక్‌ను ఢీకొని రోడ్డు కిందకి వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న అయూబ్ మృతి చెందాడు. బోల్తాపడ్డ కారులో ఉన్న వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.