అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk and Drive | నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) కేసులో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం(Court) తీర్పునిచ్చింది. 1వ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరం సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా కోటగల్లికి చెందిన యాదగిరి, చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఫిరోజ్ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులుకు చిక్కారు. వీరిని విచారణ అనంతరం కోర్టులో హాజరుపర్చారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహార్ ఇరువురికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్హెచ్వో రఘుపతి పేర్కొన్నారు.
Drunk and Drive | 5వ టౌన్ పరిధిలో..
నగరంలోని ఐదో టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒకరికి జైలుశిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో తనిఖీలు చేస్తుండగా చింతల కుమార్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుతుపున్నట్లు గుర్తించి కోర్టులో హాజరుపర్చారు. విచారించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate nizamabad) ఆ వ్యక్తికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.