అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Online betting | ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు Police శనివారం అరెస్ట్ చేశారు. సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేశ్ కుమార్ South Rural Circle Inspector Suresh Kumar వివరాలు వెల్లడించారు.
సీఐ వివరాల ప్రకారం.. నగరంలోని లతీఫ్ కాలనీకి చెందిన ఆసిఫ్ అలీ ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడనే పక్కా సమాచారంతో అర్సపల్లి పెట్రోల్‌బంక్ Arsapalli Petrol Bank వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బెట్టింగ్ కు సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.