Stock Markets | వచ్చేవారంలో పనిచేసేది మూడు రోజులే

Stock Markets | వచ్చేవారంలో పనిచేసేది మూడు రోజులే
Stock Markets | వచ్చేవారంలో పనిచేసేది మూడు రోజులే

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) వచ్చేవారం మూడు రోజులే పనిచేయనున్నాయి. వారాంతపు (Weekend) సెలవులకు తోడు మరో రెండు సెలవులు వస్తుండడంతో మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్‌ (Trading) జరగనుంది.

Advertisement
Advertisement

సాధారణంగా మన స్టాక్‌ మార్కెట్లు వారంలో ఐదు రోజులు పనిచేస్తాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు ఉంటాయి. కాగా ఈసారి మరో రెండు రోజులు అదనంగా సెలవులు వచ్చాయి. April 14న(సోమవారం) అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌ 18న(శుక్రవారం) గుడ్‌ఫ్రైడే (Good Friday) ఉంది. ఆ రోజు కూడా మార్కెట్లకు సెలవు ఇచ్చారు. దీంతో ఏప్రిల్‌ 14న ప్రారంభమయ్యే వారంలో మూడు మాత్రమే వర్కింగ్‌ డేస్‌ ఉండనున్నాయి. కాగా ఈనెలలో ఇప్పటికే మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 10న సెలవు దినంగా పాటించిన విషయం తెలిసిందే.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Stock Market | పడిలేచిన కెరటంలా.. భారీగా పెరిగిన స్టాక్‌ మార్కెట్‌