LRS Scheme | ఓపెన్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్​.. కారణమిదే..!

government | ఓపెన్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్​..!
government | ఓపెన్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్​..!
Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్ : LRS Scheme | రాష్ట్రంలో ఓపెన్​ ప్లాట్లు(ఖాళీ స్థలాలు) రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. సోమవారం నుంచి అన్ని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్ ప్రక్రియకు సంబంధించిన మార్గ దర్శకాలను జారీ చేసింది. రిజిస్ట్రేషన్​ కార్యాలయంలోనే(registration department) ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించింది.

LRS Scheme | 2020లో శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

2020లో అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ పథకానికి(LRS Scheme) శ్రీకారం చుట్టింది. నాన్​ లేఅవుట్​ ప్లాట్ల(Non layout plots) క్రమబద్ధీకరణ కోసం నామినల్​గా ఫీజు తీసుకుని దరఖాస్తులను స్వీకరించింది. తదనంతరం ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. కోర్టు కేసులు తదితర కారణాలతో ప్రక్రియ ఏళ్లుగా పెండింగ్​లో పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తుదారులు ఈ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా రేవంత్​రెడ్డి సర్కారు కీలక ప్రకటన చేసింది. ఎల్​ఆర్​ఎస్​కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Bheemgal | ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

LRS Scheme | రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లోనే..

ఎల్​ఆర్​ఎస్​(LRS Scheme) కోసం దరఖాస్తు చేసుకున్న వారు తదుపరి ప్రక్రియ కోసం సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్​ కార్యాలయానికి దరఖాస్తుదారు వెళ్లిన సందర్భంలో సంబంధిత ఎల్​ఆర్​ఎస్ వివరాలు సమర్పిస్తే ఆటోమెటిక్​గా ఫీజు వివరాలు తెలుస్తాయి. ఇందుకు సంబంధించిన చలానా చెల్లించిన వెంటనే క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్​ను అప్​డేట్​ చేసింది. ఎల్​ఆర్​ఎస్​ స్కీం(LRS Scheme) ఫీజు ఆటోమెటిక్​గా జనరేట్​ అవుతోంది.

LRS Scheme | 25 శాతం రిబేట్

ఎల్​ఆర్​ఎస్​ పూర్తి చేసుకునే వారికి 25 శాతం రిబేట్​(25 percent rebate) ఇవ్వనున్నారు. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్​ఆర్ఎస్​ ఫీజులో రాయితీ వర్తించనుంది.

Advertisement