అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Operation Chabutra | అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్(Nuisance) చేస్తున్న ఆకతాయిల ఆటకట్టించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ చబుత్ర’ (Operation Chabutra) పేరిట తనిఖీలు చేస్తున్నారు.
నగరంలోని రెండో టౌన్ పరిధిలో గల అహ్మద్పురా కాలనీ(Ahmedpura Colony)లో శనివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రోడ్లు, గల్లీల్లో తిరుగుతున్న ఆకతాయిలను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Operation Chabutra | రాత్రి 10.30 గంటల్లోపు షాపులు మూసివేయాలి
ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్రాజ్ (CI SRINIVAS RAJ) మాట్లాడుతూ నగరంలోని వ్యాపారస్తులు తమ దుకాణాలను ఎట్టిపరిస్థితుల్లో రాత్రి 10.30 గంటల లోపు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. క్యాష్ బ్యాగులతో అర్ధరాత్రి వేళ వరకు షాపుల్లో ఉంటే వారికే ప్రమాదమని వివరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు మొదట ఫైన్ వేస్తామని.. మరోసారి కూడా తెరిచి ఉంచితే న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తుందన్నారు. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు షాప్లు ఓపెన్ ఉంచితే వారి ట్రేడ్ లైసెన్స్లు రద్దవుతాయని చెప్పారు.