Oppo | OPPO కొత్త ఫోన్.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం

Oppo | ఒప్పోదీ అదే బాట.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం
Oppo | ఒప్పోదీ అదే బాట.. భారీ బ్యాటరీతో లాంచింగ్‌కు సిద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo | ప్రస్తుతం భారీ బ్యాటరీ (Battery) సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్లు smart phone మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇప్పటికే ఐక్యూ, వివోలు భారీ బ్యాటరీ huge battery ఫోన్లను లాంచ్‌ చేయగా.. ఇప్పుడు ఒప్పో(Oppo) వంతు వచ్చింది.

Advertisement
Advertisement

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల smart phones తయారీ కంపెనీ అయిన ఒప్పో తన వినియోగదారులకోసం మొట్టమొదటి సారిగా భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్న మోడల్‌ను భారత్‌లో విడుదల చేయబోతోంది. 7000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల కే13(K13) మోడల్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఐసీ పర్పుల్‌(Icy purple), ప్రిస్మ్‌ బ్లాక్‌(Prism black) కలర్స్‌లో విడుదలయ్యే ఈ ఫోన్‌ ధర రూ.20 వేలకు అటూ ఇటూగా ఉండవచ్చని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లలో రిలీజ్‌ చేస్తారు. ఈ మోడల్‌ స్పెసిఫికేషన్స్‌ ఏమిటో తెలుసుకుందామా..

  • Display : 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 Hz Refresh rate,
    1200 nits peak brighness.
  • Processor : క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌(4ఎన్‌ఎం)
  • Software : ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15.
  • Camera : బ్యాక్‌ కెమెరా ఏఐ ఆధారిత 50 MP + 2 MP.
  • ఫ్రంట్‌ కెమెరా 16 MP.
ఇది కూడా చ‌ద‌వండి :  IQOO Z10 | భారీ బ్యాటరీలో భారత్‌లో తొలిఫోన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే?

Battery capacity : 7000 mAh, 80w Super VOOC ఫాస్ట్‌ చార్జింగ్‌ (30 నిమిషాల్లో 0 నుంచి 62 శాతం చార్జింగ్‌ అవుతుందని, బ్యాటరీ ఐదేళ్లపాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 100 శాతం చార్జింగ్‌ చేస్తే 49.4 గంటల పాటు కాలింగ్‌ టైం ఉంటుందని పేర్కొంటోంది)

Price : రూ. 17 వేలనుంచి రూ. 22 వేల వరకు ఉండవచ్చని అంచనా.

Advertisement