అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష పార్టీలు వినూత్న నిరసన తెలిపాయి. పలువురు ఎంపీలు మోదీ-అదానీ మాస్కులు ధరించి కరాచలనం చేసుకుంటూ నిరసన తెలిపారు. మోదీ-అదానీ ఒకటే అర్థం వచ్చేలా ప్రదర్శన చేయగా.. రాహుల్‌ గాంధీ వారిని ఇంటర్వ్యూ చేశారు. అయితే పార్లమెంట్‌లో అందానీ, మణిపూర్‌ అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలా నిరసన తెలిపారు.