అక్షరటుడే, ఆర్మూర్ : దుర్గామాతల నిమజ్జన యాత్రలో పోలీసులు డీజే బాక్స్‌లను తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. ఆర్మూర్‌ పట్టణంలో సోమవారం యాత్ర నిర్వహిస్తుండగా పోలీసులు డీజే బాక్స్‌లను తీసుకెళ్లారు. దీంతో బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. డీజే బాక్స్‌లను తిరిగివ్వడంతో వారు ఆందోళన విరమించారు.