URBAN MLA | ఉస్మానియా వర్సిటీకి సురవరం పేరు పెట్టాలి: అర్బన్ ఎమ్మెల్యే
URBAN MLA | ఉస్మానియా వర్సిటీకి సురవరం పేరు పెట్టాలి: అర్బన్ ఎమ్మెల్యే
Advertisement

అక్షరటుడే, ఇందూరు: URBAN MLA | ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. అలాంటి మహనీయుడి పేరు చిరస్థాయిలో నిలవాలంటే యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని సూచించారు.

URBAN MLA | పొట్టిశ్రీరాములు పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం..

తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ధన్​పాల్​ పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అని అభివర్ణించారు. పేరుమార్పుపై ప్రభుత్వం పురాలోచించాలని సూచించారు.

URBAN MLA | ఆయన త్యాగం మరువలేనిది..

పొట్టి శ్రీరాములు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, దేశం గర్వించే మహనీయుల్లో ఒకరని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూచించారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేసి, ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు.

Advertisement