అక్షరటుడే, వెబ్డెస్క్ : Chiranjeevi | సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తమ బిడ్డ శంకర్ ఇంటికొచ్చాడని పేర్కొన్నారు. అయితే ఇంకా కోలుకోవాలని, తమ కులదైవమైన ఆంజనేయ స్వామి దయ, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యం మామూలుగా ఉంటాడని ఆకాంక్షించారు. శనివారం హనుమాన్ జయంతి.. అని ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి పసి బిడ్డని కాపాడి తమకు అండగా నిలిచారన్నారు. శంకర్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
Chiranjeevi | మా బిడ్డ ఇంటికొచ్చేశాడు.. చిరంజీవి ట్వీట్
Advertisement
Advertisement