అక్షరటుడే, వెబ్డెస్క్: HARIDA | మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని.. దీనిని ముందు తరాలకు అందించడం మన బాధ్యతగా భావించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీలు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ భాషలో రాసే కవితలు, కథలతో మనుగడలో లేని తెలంగాణ పదాలు, సామెతలు, నుడికారాలు వెలుగులోకి తీసుకొచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. పోటీలు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉత్సాహవంతులు పాల్గొనే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
Mlc kavitha | 30వ తేదీలోపు పంపించాలి..
హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ భాషలో కవితలు, కథలు రాసి మే 30వ తేదీలోపు haridaasaraswathiraj@gmail.comకు పంపాలని.. వివరాలకు 9948032705లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, రామ్, స్మృతిక తదితరులు పాల్గొన్నారు.