Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని అచ్చంపేట జెడ్పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్ ఫరిధిలో గురువారం బడి బయటి పిల్లల గుర్తింపు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బడి మానేసిన పిల్లలను గుర్తించినట్లు సీఆర్‌పీ శ్రీధర్ కుమార్ తెలిపారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాగి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం సమీనా బేగం పాల్గొన్నారు.
Advertisement