అక్షరటుడే, హైదరాబాద్: Outsourcing jobs : దుబాయ్‌లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy).. అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్(Telangana State Mineral Development Corporation Chairman ), మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి తెలిపారు.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ దుబాయ్ లో హత్యకు గురైన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను స్వదేశానికి త్వరగా తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు.