త్వరలోనే ధాన్యం సేకరణ

0

అక్షరటుడే, ఇందూరు: యాసంగి వరి ధాన్యం సేకరణ కోసం అవసరమైన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. ఈసారి సాధారణానికి మించి లక్షా 66,761 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారని కలెక్టర్‌ వివరించారు. 11.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. కాగా, జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్‌ వెల్లడించారు. ధాన్యం సేకరణ కోసం మొత్తం 462 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్‌ రకానికి క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 ధర లభిస్తుందని తెలిపారు.