అక్షర టుడే, వెబ్ డెస్క్ Padi Kaushik Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) క్రికెట్ Cricket ఆడిన అనుభవం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) పాలిటిక్స్‌లోకి రాకముందు ఓ క్రికెటరే అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడిన పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా క్రికెటర్లయిన అంబటి రాయుడు, శిఖర్ ధావన్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ సహచరుడిగా ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్ రంజీ జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌గా ఉన్నప్పడు కౌశిక్ రెడ్డి బౌలర్‌గా జట్టులో కొనసాగాడు. 2006లో సౌత్ జోన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగినప్పుడు కౌశిక్ రెడ్డి 5కు పైగా వికెట్లు తీయడమే కాకుండా 40 పరుగులు బాది మ్యాచ్‌ను గెలిపించాడు.
Padi Kaushik Reddy : క్రికెటర్స్‌తో సరదాగా..
అప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ సౌత్ జోన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతే కాకుండా ఆ సీజన్ మొత్తం కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అద్భుతంగా రాణించాడు. ఆ సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తప్పకుండా ఎంపిక అవుతాడని అందరూ భావించారు. కానీ కౌశిక్ స్థానంలో ఆర్పీ సింగ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు.జాతీయ జట్టుకు అవకాశం వస్తుందని భావించినా రాకపోవడంతో కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఇదిలా ఉంటే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తాజాగా గుజరాత్ ప్లేయర్లని కలిసాడు. ఈ రోజు ఎస్ఆరహెచ్‌తో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్‌కి వచ్చిన గిల్, సిరాజ్‌లని కలిసాడు. తన కూతురితో వెళ్లి వారితో కలిసి డిన్నర్ కూడా చేశాడట.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గతంలో సిరాజ్ Sirajతో తరచు క్రికెట్ ఆడేవాడు కౌశిక్ రెడ్డి. (Padi Kaushik Reddy) ఆ సాన్నిహిత్యంతోనే వారిని కలిసి కొద్ది సేపు ముచ్చటించారు.కాగాఈ రోజు సాయంత్రం 7.30ని.లకి గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ Gujarat Titans, Sunrisers మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కూడా పాడి కౌశిక్ రెడ్డి హజరు అవుతాడని తెలుస్తుంది.
It was great meeting two cricketing legends of our country, Shubman Gill and the iconic Apana Hyderabadi Siraj..@ShubmanGill @mdsirajofficial @PKR @Shrinika pic.twitter.com/gzz0WAPqE7
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) April 5, 2025