అక్షరటుడే, వెబ్ డెస్క్: నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి సంబంధించి పహాడిషరీఫ్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడుకు మనోజ్‌తో పాటు కోడలు భూమా మౌనికపై కేసు నమోదైంది. అలాగే మంచు మనోజ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.