అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistani Actress On Prabhas : బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు ఒక బ్రాండ్‌గా మారిందనే చెప్పాలి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ దర్శకులు డార్లింగ్(Darling)తో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. మాస్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, పౌరాణికం(Mass, science fiction, socio-fantasy, mythology).. కథ ఏదైనా ప్రభాస్ అంటున్నారు. ఇలా రెబల్ స్టార్(rebel star) నుంచి పాన్ ఇండియా స్టార్(pan India star)గా ఎదిగిపోయారు.
ఈశ్వర్ మూవీతో తన కెరియర్ను మొదలుపెట్టిన ప్రభాస్ కు ఇప్పుడు అంతర్జాతీయంగా అభిమానులు ఉన్నారు. కాగా, పాకిస్తాన్‌లోనూ ఆయనకు బాగానే అభిమానులు ఉండటం విశేషం. ఇప్పటికే ప్రభాస్‌పై పాక్‌కు చెందిన పలువురు నటీనటులు ప్రశంసలు కురిపించారు.
తాజాగా మరో పాకిస్తానీ నటి రెబల్ స్టార్‌పై ప్రేమను కురిపించింది. ఓ టాక్ షోలో ఆమె మాట్లాడుతూ.. తాను సౌత్ ఇండియన్ సినిమాలను తెగ చూస్తుంటానని తెలిపింది. తనకు ఆ చిత్రాలంటే ఇష్టమంది. అదే సమయంలో తన ఫేవరెట్ హీరో ప్రభాస్ అని మురిసిపోతూ చెప్పింది. ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్(viral) అవుతోంది. ప్రభాస్ క్రేజ్ అంటే ఇది అని ఫ్యాన్స్ సంబర పడుతూ కామెంట్లు పెడుతున్నారు.
Pakistani actress about prabhas
Anchor :- who is your fav actor in south india ..??
She :- #Prabhas 😊❤️#salaar #Kalki2898AD #bahubali pic.twitter.com/hef6yxapoY
— પ્રભાસ 💫 (@prabharsh_) April 19, 2025