అక్షరటుడే, వెబ్డెస్క్: India- Pak Border | కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ pakistan జరిపిన కాల్పుల్లో మన సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) మరణించాడు.
జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్(Pakistan) జరిపిన కాల్పులకు తెగబడింది. కేరీ భట్టల్(Kerry Bhattal) ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో గల ఒక వాగు సమీపంలో భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదుల గుంపు కదులుతున్నట్లు దళాలు గుర్తించాయి. వారిని గమనించిన భారత ఆర్మీ(Indian Army) సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. దీంతో చొరబాటుదారులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలో చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో ఓ జేసీవో మరణించారు.
India- Pak Border | తరచూ ఉల్లంఘన
పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ అక్రమ చొరబాట్లకు పాల్పడుతోంది. తాజా ఘటనను 2021 తర్వాత జరిగిన అతి పెద్ద కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఆర్మీ(indian Army) అధికారులు తెలిపారు.
సరిహద్దు ఉద్రిక్తతలను నివారించడమే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత్, పాక్ మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగిన రెండు రోజులకే తాజా కాల్పులు చోటు చేసుకున్నాయి. పదేపదే సరిహద్దు ఉగ్రవాద ప్రయత్నాలు, కాల్పుల విరమణ ఉల్లంఘనలపై భారత సైన్యం(Indian Army) అధికారికంగా పాకిస్తాన్‌కు నిరసన తెలిపింది.