అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులను విధులు సక్రమంగా చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ఎందరో అధికారులు తమ విధులకు లీవ్ పెట్టి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టో విడుదల చేసి తన సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అడ్డుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.