అక్షరటుడే, జుక్కల్: పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో నూతన పంచాయతీ భవనం నిర్మించేందుకు సోమవారం పంచాయతీరాజ్ డీఈ మధుబాబు స్థల పరిశీలన చేశారు. గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు అధికారి తెలిపారు. ఏఈ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ పెద్దలు మల్లప్ప పటేల్ తో పాటు నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement