అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | పంచాయతీ కార్యదర్శి ఆస్తులు చూసి ఏసీబీ(ACB) అధికారులే షాక్ అయ్యారు. తిరుపతి(Tirupati) జిల్లా చంద్రగిరి పంచాయతీ ఈవోగా పని చేసిన మహేశ్వరయ్య ఫిబ్రవరిలో రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. దీంతో ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మంగళవారం మహేశ్వరయ్య ఇళ్లలో దాడులు చేశారు.
ఆయన ఆస్తులు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.