అక్షరటుడే, కామారెడ్డి టౌన్ : ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం దోమకొండ బ్లాక్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. 2022 జూలై నుంచి 2024 జూలై వరకు ఐదు డీఏలు రావాల్సి ఉందన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని డీఏలను విడుదల చేయాలని కోరారు.